Pawan Kalyan: పవన్ కళ్యాణ్ OG సినిమాలో జపాన్ స్టార్ యాక్టర్ కన్ఫర్మ్.. హైప్ పెంచుతున్న పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-10 13:08:16  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ OG సినిమాలో జపాన్ స్టార్ యాక్టర్ కన్ఫర్మ్.. హైప్ పెంచుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రాజకీయాల వల్ల నిలిచిపోయిన తన సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఒప్పుకున్న చిత్రాలు ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ‘ఓజీ’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్‌గా కనిపించనుంది. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి కీలక పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi) విలన్‌గా చేస్తున్నాడు.

అయితే ఇందులో పవన్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్ పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్స్‌లోకి రాబోతోంది. ఇక ఇందులోంచి విడుదలైన అన్ని అప్డేట్స్ మంచి రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే ఈ చిత్రం నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని పవన్ అభిమానులు నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఓజీ’ సినిమాలో జపాన్ స్టార్ యాక్టర్ కెయిచి అండో(Keiichi Ando) కీలక రోల్‌లో కనిపించనున్నాడు.

ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు. ఈ సినిమా కోసం కటనా ఫైట్ రిహార్సల్స్ చేస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. ఆయనకు సంబంధించిన పలు పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. వాటిని షేర్ చేస్తూ కెయిచి ‘‘నేను కొత్త సినిమా చేస్తున్నాను. నా మూవీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీ ప్రేమ, మద్దతుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. త్వరలోనే కలుద్దాం’’ అని రాసుకొచ్చారు. దీంతో పవన్ అభిమానులు ఆయన శుభాకాంక్షలు చెప్తున్నారు.

Next Story