ఇదీ Pawan Kalyan సత్తా.. చరిత్ర సృష్టించిన జల్సా రీ-రిలీజ్

by Disha Web Desk 2 |
ఇదీ Pawan Kalyan సత్తా.. చరిత్ర సృష్టించిన జల్సా రీ-రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటే చాలు అభిమానులకు పూనకాలు వస్తాయి. ఆయన సినిమా విడుదల అయిందంటే చాలు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ సొంతం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే, పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమా రీ రిలీజ్ చేయడంతో థియేటర్ల వద్ద మరోసారి హంగామా సృష్టించారు. దాదాపు 700ల‌కు పైగా స్క్రీన్‌ల‌లో విడుద‌లైన జల్సా.. పోకిరి రికార్డును చెరిపివేసింది. జల్సా మూవీ స్పెష‌ల్ షోస్‌కు దాదాపు రూ.2.85కోట్ల వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ట్ చేసి స‌రికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఒక రీ-రిలీజ్ మూవీకి ఈ స్థాయిలో క‌లెక్షన్స్ వ‌చ్చాయంటే విశేషం అనే చెప్పాలి. ఇక దీన్ని బ‌ట్టి చూస్తే ప‌వ‌న్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

2008లో విడుద‌లైన జల్సా చిత్రం ప‌వ‌న్ ఫ్లాప్‌ల‌కు బ్రేక్ వేసింది. త్రివిక్రమ్ డైరెక్షన్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, ప‌వ‌న్ ప‌ర్‌ఫార్మెన్స్ సినిమాను బిగ్గెస్ట్ హిట్‌గా చేశాయి. అప్పట్లో వెయ్యి స్క్రీన్‌ల‌లో విడుద‌లైన మొద‌టి సినిమాగానూ జల్సా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా టాలీవుడ్‌కు ఫ‌స్ట్‌లుక్ కాన్సెప్ట్‌ను ప‌రిచ‌యమైంది కూడా జాల్సా సినిమాతోనే. అందుకే పవన్ కల్యాణ్‌ను ట్రెండ్ సెట్టర్ అంటున్నారు. కేవలం అభిమానులే కాకుండా టాలీవుడ్‌లోని ఎంతో మంది హీరోలను ఆయన స్టైల్‌ను ఫాలో అవుతుంటారు. అంతేగాక, జల్సా సినిమాతో పాటు తమ్ముడు సినిమా కూడా రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల వివరాలు ఇంకా తెలియరాలేదు.

ఇవి కూడా చ‌ద‌వండి :

వాళ్లను అడ్డుకుంటే స్వయంగా నేనే రోడ్డెక్కుతా: Pawan Kalyan

Next Story