- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లియో’ చిత్రంలో పవన్ కళ్యాణ్.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..!
తమిళ హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కిన ‘లియో’ చిత్రం ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

X
దిశ, సినిమా: తమిళ హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కిన ‘లియో’ చిత్రం ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే ముందు నుండి ‘విక్రమ్’ సినిమాలో రోలెక్స్ పాత్ర క్లైమాక్స్ లో ఎలా అయితే వస్తుందో, ‘లియో’ చిత్రం క్లైమాక్స్ లో కూడా ప్రముఖ స్టార్ హీరో ఎంట్రీ ఇస్తాడని.. ఇక ఆ హీరో ఎవరు, ఏమిటి అనేది సర్ ప్రైజ్ అంటూ మూవీ టీం ఊరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని టాక్ వినిపించినప్పటికి తాజాగా మరో స్టార్ పేరు వినపడుతుంది. అయితే రీసెంట్ గా ఈ ‘లియో’ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఉంటాడని మరో బాంబు పేల్చింది ఆ చిత్రం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్. అంటే దాని అర్థం పవన్ కళ్యాణ్ ఈ మూవీలో ఉండడం కాదు, ఇంటర్వెల్ వచ్చినప్పుడు పవర్ స్టార్ లేటెస్ట్ చిత్రం ‘ఓజీ’ గ్లింప్స్ వీడియోని ప్లే చేస్తారట.
Next Story






