పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్

by Disha Web Desk 2 |
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న ఆ సినిమా అప్డేట్ రానే వచ్చేసింది. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్‌ షూటింగ్స్‌పై పవన్ కల్యాణ్ దృష్టి పెట్టడంతో ఆగిపోయిందనుకున్న ఆ చిత్రం మళ్లీ తెరమీదకు వచ్చింది. అదే క్రిష్ జాగర్లమూడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తు్న్న హరిహర వీరమల్లు చిత్రం. తాజాగా.. ఈ మూవీ నుంచి చిత్రబృందం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం VFX వర్క్ ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో జరుగుతోందని ప్రకటించింది. ‘మీ అంచనాలు అందుకునేలా ప్రతిక్షణం పరితపిస్తున్నాం. త్వరలోనే ఓ స్పెషల్ ప్రోమోను విడుదల చేస్తాం’ అని మెగాసూర్య ప్రొడక్షన్ తెలిపింది. కాగా, ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌కు వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.


Next Story

Most Viewed