‘OG’ డైరెక్టర్ Sujeethకు Pawan Kalyan మహిళా ఫ్యాన్ సూసైడ్ లెటర్.. పోస్ట్ వైరల్

by Disha Web Desk 6 |
‘OG’ డైరెక్టర్ Sujeethకు Pawan Kalyan మహిళా ఫ్యాన్ సూసైడ్ లెటర్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూనే రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉంటున్నారు. అయితే ఇటీవల ఆయన పుట్టిన రోజున సుజిత్ దర్శకత్వంలో నటిస్తున్న ఓజీ, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్, క్రిషన్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు సినిమాల నుంచి అదిరిపోయే అప్డేట్స్‌ను వదిలి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. పవన్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంతలా ఉటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు సంబంధించిన సినిమాల అప్డేట్స్ విడుదలయితే సోషల్ మీడియా షేక్ అవుతుంది. అలాంటిది ఒకేసారి అన్ని అప్డేట్స్ వదలడంతో వాటిని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవడంతో పాటు వాటిని మర్చిపోలేక పోతున్నారు.

తాజాగా, ఓ మహిళ ఓజీ గ్లింప్స్ చూసి డైరెక్టర్ సుజిత్‌కు సూసైడ్ నోట్ రాసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘పొద్దున నుండి మీరు ఇచ్చిన హైప్ పోవడం లేదు సుజిత్ గారు. ఏంటండి ఇది. హాస్పిటల్‌లో ఉన్న నాకే ఇలా ఉంటే ఇంకా మన కల్ట్ ఫ్యాన్స్ సంగతి ఇంకెలా ఉందో. బీపీ హై అయిపోయింది. కంట్రోల్ అవడం లేదు. హార్ట్ బీట్ స్పీడ్‌గా కొట్టుకుంటుంది. ఇది తగ్గడానికి హాస్పిటల్‌లో టాబ్లెట్స్ సరిపోవడం లేదు. బ్లడ్ డ్రై గా మారిపోయింది. హార్ట్ స్ట్రోక్‌తో నేను పోతే రెస్పాన్స్‌బులిటీ ఎవరిది. మా కల్యాణ్ గారిని చూస్తేనే వైబ్స్. అలాంటిది మీరు చూపించిన విధానం మామూల్‌గా లేదు. బర్త్ డేకి మా ఫ్యాన్స్‌కు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చారు. అస్సలు మర్చిపోలేను మేము. దానికి తోడు తమన్ గారి మ్యూజిక్ వామ్మో నేను పోతా. సుజిత్ గారు దానికి మీరు మాత్రమే కారణం ఇట్లు హాసిని’’ అంటూ రాసుకొచ్చింది.

Next Story

Most Viewed