- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరూ చూస్తుండగానే అంజలిని అసభ్యంగా తాకిన పవన్.. బండ బూతులు తిడుతున్న నెటిజన్లు (వీడియో)
గత కొద్ది కాలంగా సినీ సెలబ్రిటీలు అందరి ముందు అసభ్యంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా సినీ సెలబ్రిటీలు అందరి ముందు అసభ్యంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. నటీమణులను తాకుతూ చిక్కుల్లో పడుతున్నారు. లేదా కాంట్రవర్సీ కామెంట్స్ చేసి ఫేమస్ అయ్యే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ వివాదంలో చిక్కుకుని తర్వాత క్షమాపణలు చెప్తున్నారు. తాజాగా, ఓ స్టార్ హీరో స్టేజిపై హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తించి నెటిజన్లతో తిట్లు పడుతున్నాడు. సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తించి అందరిలో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ప్రముఖ భోజ్పురి సూపర్ స్టార్‌గా పాపులారిటీ దక్కించుకున్న పవన్ సింగ్(Pawan Singh)కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అసలు విషయంలోకి వెళితే.. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న పవన్ సింగ్ హీరోయిన్ అంజలి (anjali) స్టేజ్‌పై మాట్లాడతుండగా..నడుమును తాకి ఏదో ఆమెతో చెప్పారు. అంజలి మాత్రం హీరో అలా తాకడంతో అసౌక్యంగా ఫీల్ అయినప్పటికీ దానిని ముఖంలో చూపించకుండా నవ్వుతూనే కనిపించింది. దీంతో పవన్ సింగ్ పదే పదే నడుమును తాకుతూ ఏదో శుభ్రం చేస్తున్నట్లుగా చేశాడు. దీంతో అంజలి చాలా ఇబ్బందిపడిపోయింది. అయినప్పటికీ అంతమందిలో ఏం చేయాలో తెలియక సైలెంట్‌గా ఉండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు ఓ స్టార్ నటుడు అయి ఉండి అలా ప్రవర్తించడమేంటని ఫుల్ ఫైర్ అవుతూ బూతులు తిడుతున్నారు. వెంటనే అంజలికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.






