Naresh-Pavitra: న‌రేష్-ప‌విత్రకు ‘మ‌ళ్లీ పెళ్లి’!

by Disha Web Desk 10 |
Naresh-Pavitra: న‌రేష్-ప‌విత్రకు ‘మ‌ళ్లీ పెళ్లి’!
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం న‌రేష్‌-ప‌విత్ర లోకేష్‌ల జంట హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే ప‌విత్ర మెడ‌లో నరేష్ మూడుముళ్లు వేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది. కానీ, ఆ పెళ్లి నిజమేనా.. లేదా ఏదైనా మూవీ షూటింగ్‌లో భాగంగా చేసుకున్నారా అనేది ఇంకా క్లారిటీ లేదు. తాజాగా ఈ పెళ్లి వీడియో వెన‌కున్న సీక్రెట్‌ను శుక్రవారం నరేష్ రివీల్ చేశాడు. ‘ఇది రీల్ లైఫ్ వెడ్డింగ్.. రియ‌ల్‌లైఫ్ పెళ్లి కాదు’ అని చెప్పేశాడు. ఇక న‌రేష్, ప‌విత్ర కలిసి ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా చేస్తున్నారు. ఎం.ఎస్ రాజు ద‌ర్శక‌త్వంలో తెరక్కెకుతున్న ఈ మూవీలో జ‌య‌సుధ‌, శ‌ర‌త్‌బాబు, అన‌న్య నాగ‌ళ్ల, వ‌నితా విజ‌య్‌కుమార్ కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌ చేస్తూ ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ రిలీజ్ చేసిన మేకర్స్.. ఈ సమ్మర్‌లోనే మూవీ రిలీజ్ చేస్తామన్నారు.



Next Story

Most Viewed