- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా పవన్ భార్య సీమంతం వేడుక.. వైరల్‌గా మారిన ఫొటోలు.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు..
బుల్లితెర నటి అంజలి(Anjali)కి పరిచయం అక్కర్లేదు. ఆమె పలు సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: బుల్లితెర నటి అంజలి(Anjali)కి పరిచయం అక్కర్లేదు. ఆమె పలు సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. మరీ ముఖ్యంగా ‘మొగలిరేకులు’ సీరియల్‌తో అంజలి రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకుల్లో తన పాపులారిటీని పెంచుకుంతి. ఈక్రమంలోనే పవన్(Pavan)ను పెళ్లాడిన ఆమెకు చందమామ(chandamama) (దాన్విక షాష) అనే పాప కూడా ఉంది. ఇక అప్పటినుంచి ఈ జంట ఓ యూట్యూబ్ చానల్ నడుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు.
పలు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ మొత్తం పలు బుల్లితెర షోస్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇటీవల ఫాదర్స్ డే స్పెషల్ ప్రోగ్రాం లోనూ కూతురితో పాల్గొన్నారు. ఇక అంజలి ఇటీవల రెండోసారి ప్రెగ్నెంట్ అయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, అంజలి సీమంతం వీడియోను షేర్ చేసింది. దీనికి ‘‘మా జ్ఞాపకాలను సంగ్రహించి, రీల్ అవుట్‌పుట్‌ను క్షణాల్లో అందించినందుకు ఫ్లాష్‌షూట్‌కి ధన్యవాదాలు.
ఫ్లాష్‌షూట్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి రీల్ తయారీ యాప్. వారు మీ ఏవైనా సందర్భాలలో, ఒకేసారి షూట్ చేసి రీల్స్‌ను తయారు చేస్తారు. iPhoneలో చిత్రీకరించి గంటల్లో డెలివరీ చేస్తారు’’ అని రాసుకొచ్చింది. అయితే ఘనంగా ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు బుల్లితెర నటీనటులు హాజరై సందడి చేశారు. ఇక ఈ జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వాటిని చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.






