Pathaan Controversy Row: వివేక్ అగ్నిహోత్రి కూతురి ఆరెంజ్ బికినీ ఫొటోస్ వైరల్

by Disha Web Desk 6 |
Pathaan Controversy Row: వివేక్ అగ్నిహోత్రి కూతురి ఆరెంజ్ బికినీ ఫొటోస్ వైరల్
X

దిశ, సినిమా : షారుఖ్-దీపిక 'పఠాన్' మూవీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. 'బేషరమ్ రంగ్' సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతుండగా.. సెక్షన్ ఆఫ్ పీపుల్ దీపిక ఆరెంజ్ స్విమ్ సూట్‌పై విరుచుకుపడుతున్నారు. ఈ మధ్య 'ది కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్ కూడా ఈ విషయంపై కామెంట్స్ చేశాడు. 'ఇలాంటి దుస్తులు ధరించేందుకు సిగ్గులేదా?' అని భారతీయులందరి తరపున ఓ అమ్మాయి అడుగుతున్నట్లు వీడియో పోస్ట్ చేశాడు. కాగా దీనిపై స్పందించిన నెటిజన్స్.. గతంలో అమ్మాయి శరీరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్న మాటలు గుర్తులేదా అని ప్రశ్నిస్తున్నారు. జీడ్, హేట్ స్టోరీ లాంటి సినిమాలు చేసినప్పుడు ఈ బుద్ధి ఏమైందని క్వశ్చన్ చేస్తున్నారు. అంతేకాదు వివేక్ అగ్నిహోత్రి కూతురు మల్లిక ఆరెంజ్ బికినీ పిక్స్ షేర్ చేస్తూ.. దీనికి సమాధానం ఏం చెప్తావని అడుగుతున్నారు. దీంతో మల్లిక వెంటనే తన ఇన్‌స్టా ఎకౌంట్‌ను ప్రైవేట్‌గా మార్చేయడం విశేషం.



Next Story

Most Viewed