హీరో కోసం బార్‌లో జుట్టుపట్టి కొట్టుకున్న అమ్మాయిలు.. నావాడే అంటూ

by Phanindra |   (  Updated:2023-06-27 06:08:47  IST  )

టెలివిజన్ హీరో పార్థ్ సమతాన్.. తనకోసం ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన బార్‌ గొడవపై ఓపెన్ అయ్యాడు.

హీరో కోసం బార్‌లో జుట్టుపట్టి కొట్టుకున్న అమ్మాయిలు.. నావాడే అంటూ
X

దిశ, సినిమా: టెలివిజన్ హీరో పార్థ్ సమతాన్.. తనకోసం ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన బార్‌ గొడవపై ఓపెన్ అయ్యాడు. ఇటీవల ఓ బార్‌లో తన ఫ్రెండ్ ఇచ్చిన పార్టీకి హాజరైన నటుడు.. మద్యం మత్తులోవున్న గర్ల్స్ తన పేరును ప్రస్తావిస్తూ కొట్టుకోవడం అసభ్యంగా అనిపించిందని చెప్పాడు. ‘ఒకసారి బార్‌లో ఇద్దరు యువతులు నాకోసం గొడవపడ్డారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని లాగేసుకున్నారు. అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. నాకు చూడాలనిపించలేదు. అయితే అది ఆడవారి విషయం కాబట్టి మధ్యలో జోక్యం చేసుకోవద్దని సన్నిహితులు చెప్పారు. దీంతో ఫైట్ చూస్తూ ఓ మూలన కూర్చున్నా. వాళ్లిద్దరూ నా కోసం చాలాసేపు పోట్లాడారు’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Next Story