'పరిణీతి 2.0'.. ఇకపై మూస పద్ధతులను బద్దలు కొట్టేస్తా

by Disha Web Desk 7 |
పరిణీతి 2.0.. ఇకపై మూస పద్ధతులను బద్దలు కొట్టేస్తా
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ పరిణీతి చోప్రా నటించిన లేటస్ట్ మూవీ 'కోడ్ నేమ్: తిరంగ'. అయితే ఈ చిత్రానికి తాను నటించిన 'సందీప్ ఔర్ పింకీ ఫరార్, 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్', 'సైనా' మూవీస్‌తో దగ్గరిపోలికలున్నాయన్న నటి.. ఈ సినిమాతో తనను బబ్లీ గర్ల్ అనే పిలిచే మూసపద్ధతిని బద్దలు కొట్టేయబోతున్నట్లు తెలిపింది. ఇక కెరీర్‌లో ప్రస్తుత దశను 'పరిణీతి 2.0'గా అభివర్ణించుకున్న ఆమె తనను తాను సరికొత్త మెరుగైన వెర్షన్‌గా పిలుచుకుంది. అలాగే గత ఐదేళ్లుగా యాక్షన్ డ్రామా చేయాలని బలంగా ఫిక్స్ అయినట్లు చెప్పిన పరిణీతి.. త్వరలోనే మరొక యాక్షన్ మూవీ చేయబోతున్నానని, భవిష్యత్తులో యాక్షన్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇందుకోసం ముంబై, టర్కీలో కఠినమైన శిక్షణ తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక యాక్షన్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొని ఎన్నో గాయాలతో ఇంటికొస్తానన్న ఆమె.. ఆ మచ్చలు తనకు సంతృప్తినిస్తాయని పేర్కొంది. చివరగా తన చిత్రాలను ప్రేమిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక టి-సిరీస్ నిర్మించిన 'కోడ్ నేమ్: తిరంగ' అక్టోబర్ 14న విడుదల కాబోతుంది.

Next Story

Most Viewed