Parineeti Chopra : నేడు పరిణీతి చోప్రా మెహందీ ఫంక్షన్..

by Kema Shiva Kumar |   (  Updated:2023-09-22 12:06:03  IST  )

బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ ఎంపీ రాఘవ్ చద్దా రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వివాహం చేసుకోబోతున్నారు.

Parineeti Chopra : నేడు పరిణీతి చోప్రా మెహందీ ఫంక్షన్..
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ ఎంపీ రాఘవ్ చద్దా రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వివాహం చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో వధూవరుల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు ఇప్పటికే ఉదయపూర్ చేరుకున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలు సెప్టెంబర్ 23న అనగా రేపు జరగనుండగా, ఈరోజు సాయంత్రం మెహందీ వేడుక అట్టహాసంగా కొనసాగనుంది. కేవలం పరిణీతికి చెందిన అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే వేడుకకు హాజరుకానున్నారని సమాచారం. ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో పంజాబీ సంప్రదాయం ప్రకారం సెప్టెంబర్ 24న పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహ వేడుక జరగనుంది.

Next Story