ముగ్గురం కాబోతున్నామంటూ గుడ్ న్యూస్ ప్రకటించిన స్టార్ హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా (Parineeti Chopra)ఎన్నో భారీ ప్రాజెక్ట్స్‌లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

ముగ్గురం కాబోతున్నామంటూ గుడ్ న్యూస్ ప్రకటించిన స్టార్ హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా (Parineeti Chopra)ఎన్నో భారీ ప్రాజెక్ట్స్‌లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించిన ఆమె గత కొద్ది కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తోంది. గత ఏడాది ‘అమర్ సింగ్ చంకీలా’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. వాటికి సంబంధించిన షూటింగ్స్ కూడా పూర్తి చేసింది. ఇక పరిణీతి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు 2023లో రాజకీయ నాయకుడు రాఘవ చద్దా(Raghava Chadha)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇక అప్పటినుంచి పర్సనల్ లైఫ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టి భర్తతో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, పరిణీతి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది. తాను తల్లి కాబోతున్నట్లు వెల్లడిస్తూ.. ముగ్గురం కాబోతున్నాం. బేబీ ఆన్ ది వే అనే క్యాప్షన్ జత చేసింది. అలాగే బేబీ అడుగుల ఫొటో షేర్ చేయడంతో పాటు తన భర్తతో వెళ్తున్న వీడియోను నెట్టింట పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story