Parineeti Chopra: సెప్టెంబర్ 10న 'క్లీనోత్సవ్' నిర్వహిస్తున్న పరిణీతి.. అందరూ పాల్గొనాలని రిక్వెస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-05 14:13:00  IST  )

దిశ, సినిమా : బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తన అభిమానులను బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండేలా తరచూ ప్రేరేపిస్తుంది. ఈ క్రమంలోనే గణేష్ చతుర్థి వేడుకల అనంతరం ముంబైలోని బీచ్‌లను తన బృందంతో కలిసి శుభ్రం చేయనున్నట్లు ప్రకటించింది..Latest Telugu News

Parineeti Chopra: సెప్టెంబర్ 10న క్లీనోత్సవ్ నిర్వహిస్తున్న పరిణీతి.. అందరూ పాల్గొనాలని రిక్వెస్ట్
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తన అభిమానులను బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండేలా తరచూ ప్రేరేపిస్తుంది. ఈ క్రమంలోనే గణేష్ చతుర్థి వేడుకల అనంతరం ముంబైలోని బీచ్‌లను తన బృందంతో కలిసి శుభ్రం చేయనున్నట్లు ప్రకటించింది. పర్యావరణానికి హాని కలగకుండా పండుగను జరుపుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పిన పరిణీతి.. 'మీ అందరికీ గణేషోత్సవం శుభాకాంక్షలు. గణపతి బప్పా మనకు జ్ఞానం, శ్రేయస్సును ప్రసాదిస్తారని ఆశిస్తున్నా. ఈ అందమైన పవిత్రమైన పండుగను జరుపుకోవడం అందరం ఇష్టపడతాం.

కానీ, ఉత్సవాలు ముగిసిన తర్వాత ఏg చేయాలో మర్చిపోవద్దు. ప్రతి ఏడాది గణపతి నిమజ్జనం సమయంలో బీచ్‌లలో మనం వదిలేసిన చెత్తంతా సముద్రాన్ని కలుషితం చేయడమే కాకుండా నీటిలో జీవుల మరణాలకు కారణమవుతూ చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే మనమంతా బీచ్‌లను శుభ్రపరిచి భూ గ్రహాన్ని రక్షించే బాధ్యతను తీసుకుందాం. సెప్టెంబర్ 10న చెత్త ఏరివేయడానికి మాతో చేరండి. ఈ మంచిపని గణేషుడికి నిజంగా సంతోషాన్ని కలిగిస్తుంది. మీ సహకారంతో 'క్లీనోత్సవ్ 2022' గొప్ప విజయాన్ని సాధిస్తుందని భావిస్తున్నా' అంటూ తను చేపట్టిన ఈ కార్యంలో.. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరింది.

Also Read : ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా.. ఫస్ట్ వినాయకుడికే ఎందుకు మొక్కుతారో తెలుసా...?

Next Story