మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది.. 'కోడ్ నేమ్ : తిరంగా'పై Parineeti Chopra

by Disha Web Desk 6 |
మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది.. కోడ్ నేమ్ : తిరంగాపై Parineeti Chopra
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, హర్డీ సంధు ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'కోడ్ నేమ్ : తిరంగా'. పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది పరిణీతి. ఇక హార్డీ‌తో తను స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి కాగా.. దీన్ని ఒక 'స్పెషల్ ట్రీట్'గా పేర్కొంది. సెట్‌లో ఒకరినొకరు కలుసుకున్న రెండో సెకన్‌లోనే ఎన్నో ఏళ్లుగా పరిచయమున్న వ్యక్తుల వలె కనెక్ట్ అయ్యామని.. ముఖ్యంగా పంజాబీస్ కావడంతో షూటింగ్‌ స్పాట్‌లో మాతృభాషలోనే మాట్లాడుకున్నట్లు వెల్లడించింది. అలాగే మ్యూజిక్, ఫుడ్ హ్యాబిట్స్‌లోనూ తమకు దగ్గరి పోలికలున్నాయన్న నటి.. తమ ఫ్రెండ్‌షిప్ బాండింగ్‌, కెమిస్ట్రీని తెరపై అభిమానులకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఇక రిభు దాస్‌గుప్తా దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 14న థియేటర్లలోకి రానుంది.

ALSO READ : రామ్ చరణ్ ఇంట్లో టీమిండియా క్రికెటర్స్ హల్‌చల్

Advertisement
Next Story

Most Viewed