18 ఏళ్లలోపు పిల్లలు ఆ ఎపిసోడ్ చూసినప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోండి.. డైరెక్టర్ పోస్ట్

by Disha Web Desk 7 |
18 ఏళ్లలోపు పిల్లలు ఆ ఎపిసోడ్ చూసినప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోండి.. డైరెక్టర్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా గురించి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ సాధించిన కేజీఎఫ్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. దీంతో వెంకటేష్‌ను నెటిజన్లు ఓ రేంజ్‌లో ఏకిపరేశారు. అయితే ఈ విషయమై ఆయన క్షమాపణలు సైతం చెప్పకొచ్చినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉంటే.. తాజాగా డైరెక్టర్ వెంకటేష్ హీరోగా నటించిన ‘యాంగర్ టేల్స్’ అనే సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ మేరకు ఓ పోస్ట్ రిలీజ్ చేశాడు వెంకటేష్. ‘‘రాబోయే యాంగర్ టేల్స్ అనే సీరిస్‌లోని నా ఎపిసోడ్ ‘రంగా’ లో కథానుసారంగా 18 ఏళ్లలోపు వారికి తగని భాష వాడబడినది. ఈ ఎపిసోడ్‌ను చూసేటప్పుడు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కానీ, మిగిలిన 3 ఎపిసోడ్లు: ‘‘రాధ’, ‘గిరి’, ‘పూజ’’ లను కుటుంబ సమేతంగా చూసి ఆనందించవచ్చు’’ అంటూ షేర్ చేశాడు. కాగా.. ఈ ఎపిసోడ్ మార్చి 9 న డిస్నీ ప్లెస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story