- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రికార్డ్ క్రియేట్ చేసిన పా రంజిత్ సినిమా.. ఇది రెండు దేశాలకు గౌరవం అంటూ ఎమోషనల్ ట్వీట్
కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్(Pa Ranjith) గత ఏడాది ‘తంగలాన్’ (Thangalan)చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్(Pa Ranjith) గత ఏడాది ‘తంగలాన్’ (Thangalan)చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. దర్శకుడిగానే కాకుండా ఆయన నిర్మాతగానూ ఇండస్ట్రీలో రాణించారు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘పాపా బుకా’ (papa buka)సినిమా 98వ ఆస్కార్ అవార్డుల పోటీకి ఎంపికవడం విశేషం. పపునా న్యూ గినీ దేశం నుంచి అర్హత సాధించిన తొలి చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈసినిమా పోటీ పడనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 98వ అకాడమీ అవార్డులకు ‘పాప బుకా’ అధికారికంగా ఎంపికైనది. ఇది నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్స్ గర్వించదగ్గ క్షణం.
పాపా బుకా కథని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వారితో కలిసి పని చేయడం చాలా గౌరవంగా అనిపిస్తుంది. భారతదేశం నుంచి నిర్మాతలలో ఒకరిగా, రెండు దేశాల సహ నిర్మాణంలో భాగం కావటం నిల్ ప్రొడక్షన్స్‌కి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఈ కథని ప్రపంచ వేదిక వరకు తీసుకెళ్లడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి దక్కిన గౌరవం. ఈ సినిమా ద్వారా ప్రశంసలు దక్కించుకోవడం రెండు దేశాలకి గౌరవం. ఈ ఘనత సాధించిన ‘పాపా బుకా’ టీమ్ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఆయనకు కంగ్రాట్స్ చెబుతున్నారు.






