- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాలీవుడ్ స్టార్ల సరసన మన స్టార్ హీరోయిన్స్.. ఇండియా గర్వించేలా చేసిన ఆలియా, ప్రియాంక!
‘నేషనల్ జియోగ్రాఫిక్ 33 - 2026’ జాబితాను విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక లిస్ట్‌లో భారతీయ నటీమణులు ఆలియా భట్, ప్రియాంక చోప్రా చోటు దక్కించుకోవడం విశేషం.

దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో మార్పు కోసం కృషి చేస్తున్న వారిని గౌరవిస్తూ నేషనల్ జియోగ్రాఫిక్ తాజాగా ‘నేషనల్ జియోగ్రాఫిక్ 33 - 2026’ జాబితాను విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక లిస్ట్‌లో భారతీయ నటీమణులు ఆలియా భట్, ప్రియాంక చోప్రా చోటు దక్కించుకోవడం విశేషం. పర్యావరణం, ఆరోగ్యం వంటి సామాజిక అంశాలపై గ్లోబల్ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నందుకు వీరికి ఈ గుర్తింపు లభించింది. ప్రకృతిని ప్రేమించే ఆలియా, పర్యావరణ స్పృహను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తోంది. తన ప్రొడక్షన్ కంపెనీ ‘ఎటర్నల్ సన్‌షైన్’ ద్వారా ఏనుగుల వేటపై రూపొందించిన మినీ సిరీస్‌ను ఆమె సపోర్ట్ చేసింది. అలాగే ‘ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్’ అనే పుస్తకం ద్వారా జంతువులను దత్తత తీసుకోవడం ఎంత ముఖ్యమో పిల్లలకు వివరిస్తోంది. ఆమె ప్రారంభించిన ‘కోఎగ్జిస్ట్’ ప్లాట్‌ఫామ్ ద్వారా జంతు హక్కుల కోసం పోరాడుతోంది.
ఫ్యాషన్ వ్యర్థాలను తగ్గించేందుకు ‘Mi Wardrobe Is Su Wardrobe’ అనే వినూత్న కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. ఇక ప్రియాంక చోప్రా విషయానికొస్తే.. గత ఐదేళ్లుగా ‘టైప్ 1 డయాబెటిస్’పై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తోంది. తన భర్త నిక్ జోనాస్ ఈ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ, అది తన ఎదుగుదలకు అడ్డుకాదని నిరూపించడాన్ని ఆమె స్ఫూర్తిగా తీసుకున్నారు. ‘బియాండ్ టైప్ 1’ అనే సంస్థలో బోర్డ్ మెంబర్‌గా ఉంటూ, వ్యాధిని ముందే గుర్తించడంపై ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఎంతో మందికి ధైర్యాన్ని ఇస్తున్నారు. భారత్ వంటి దేశాల్లో మధుమేహం పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు ఆమె నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ జాబితాలో హారిసన్ ఫోర్డ్, ఇద్రిస్ ఎల్బా, రస్సెల్ వెస్ట్‌బ్రూక్ వంటి హాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. మన దేశం గర్వపడేలా చేస్తున్న ఈ ఇద్దరు భామలకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.






