మా రాజు సెకండ్ పంచ్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.. ‘LIK’ సినిమా అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

by Mallepaka Hamsa |

‘లవ్ టుడే’ అంటూ వచ్చిన ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)హిట్ అందుకుని తన పాపులారిటీ పెంచుకున్నాడు.

మా రాజు సెకండ్ పంచ్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.. ‘LIK’ సినిమా అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
X

దిశ, సినిమా: ‘లవ్ టుడే’ అంటూ వచ్చిన ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హిట్ అందుకుని తన పాపులారిటీ పెంచుకున్నాడు. ఆ తర్వాత చేసిన డ్యూడ్, డ్రాగన్ చిత్రాలు కూడా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచాయి. దీంతో అందరి దృష్టి ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై పడింది. ఈక్రమంలోనే ఆయన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (Love Insurance Company)మూవీతో రాబోతున్నట్లు ప్రకటించారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. సెవన్ స్క్రీన్ స్టూడియోస్, రౌడీ పిక్చర్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. యోగిబాబు, ఎస్ జే సూర్య, గౌరీ జీ కిషన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా దీపావళికి విడుదల కావాల్సి ఉండగా.. డిసెంబర్ 18కి వాయిదా వేశారు.

ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషనల్ కంటెంట్ పెంచుకునేందుకు మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసిన చిత్రబృందం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతున్నట్లు ప్రకటించారు. ‘‘పట్టు మా’’ అని సాగే ఈ పాటను నవంబర్ 27న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్లు విఘ్నేష్ పోస్ట్ పెట్టాడు.. ‘‘మీ అందరి కోసం మరో సాంగ్‌ను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మా రాజు సెకండ్ పంచ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రదీప్ రంగనాథన్, కృతి స్టైల్, స్వాగ్, అన్ని కలిపి ఎక్స్ట్రా అందంతో కూడిన సాంగ్ వస్తుంది’’ అని రాసుకొచ్చారు.

Next Story