మ్యాగజైన్‌పై వరుణ్ రొమాన్స్.. మాములుగా లేదంటున్న ఫ్యాన్స్..

by Disha Web Desk 7 |
మ్యాగజైన్‌పై వరుణ్ రొమాన్స్.. మాములుగా లేదంటున్న ఫ్యాన్స్..
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఐదేళ్ల క్రితం పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి తర్వాత ఎయిర్ ఫోర్స్ ఉగ్రవాదులపై తీర్చుకున్న రివెంజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లార్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రుహాణిశర్మ, నవదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రం మార్చి 1 థియేటర్లలో విడుదల కానుంది.

అయితే.. ఇప్పటి వరకు వరుస పరాజయాలతో డీలా పడిన వరుణ్ ఈ మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. దీంతో ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజులు క్రితం ముంబయిలో మకాం వేసి మరి పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అంతే కాకుండా.. ఇటీవల మాధవరం వెళ్లి జవాన్లకు నివాళులర్పించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా వరుణ్, మానుషి ఓ ఇంగ్లీష్ ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కవర్ పేజిపై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ఆపరేషన్ వాలెంటైన్ జోడీతో ఈ లవ్ మంత్ మరింత అట్రాక్ట్ చేస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు. ఇందులో వరుణ్ తేజ్ బ్లాక్ షూట్‌లో స్టైలిష్‌గా కనిపించగా, మానుషి బ్లాక్ కలర్ మోడ్రన్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావంతో.. లుక్ మాములుగా లేదంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Next Story

Most Viewed