- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యకు మాత్రమే ఆ అరుదైన రికార్డు సొంతం
కోలీవుడ్ టు టాలీవుడ్.. తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న స్టార్ సూర్య. తమిళ్ సినిమాలను తెలుగులో విడుదల చేసి భారీ విజయాలను అందుకున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ టు టాలీవుడ్.. తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న స్టార్ సూర్య. తమిళ్ సినిమాలను తెలుగులో విడుదల చేసి భారీ విజయాలను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం సూర్య కెరీర్‌లోనే మోస్ట్ అవెయిటెడ్ చిత్రంగా రూపొందుతుంది ‘కంగువా’. శివ దర్శకత్వంలో దిశా పఠానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక తాజాగా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయే ఒక విషయం వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో ఆరు డిఫరెంట్ యాక్షన్స్ సన్నివేశాలు ఉండనున్నాయట.
అంతేకాదు గతంలో పది భాషలలో మాత్రమే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఏకంగా మరికొన్ని భాషలలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాత జ్ఞానవేల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా 38 భాషలలో త్రీడీ ఐమాక్స్ ఫార్మాట్లోనే ‘కంగువ’ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు’ తెలిపాడు. కాగా 38 భాషలలో విడుదల అవుతున్న మొదటి సినిమాగా ‘కంగువా’తో సూర్య అరుదైన రికార్డు సొంతం చేసుకోబోతున్నాడు.






