జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే అది సాధ్యం అవుతుంది: ‘గదర్’ దర్శకుడు

by Disha Web Desk 9 |
జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే అది సాధ్యం అవుతుంది: ‘గదర్’ దర్శకుడు
X

దిశ, సినిమా: ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో హిస్టారికల్ రన్‌ని కొనసాగిస్తున్న సెన్సేషనల్ మూవీ ‘గదర్ 2’. సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ఇప్పటివరకు రూ.482 కోట్ల పైన వసూళ్లను రాబట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మూవీ దర్శకుడు అనిల్ శర్మని ‘గదర్’లో సన్నీ డియోల్ రోల్‌ని ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోస్‌లో ఎవరైనా చేయగలరా? అని ప్రశ్నించగా ‘బాలీవుడ్‌లో ఈ రోల్ ఎవరు చేయలేరు. కానీ సౌత్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది’ అని అనిల్ శర్మ చెప్పాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతుండగా తారక్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.



Next Story

Most Viewed