తెరపైకి పవిత్ర పవిత్రబంధాలు.. నరేష్ ఎన్నోవాడో తెలుసా..?

by Disha Web Desk 7 |
తెరపైకి పవిత్ర పవిత్రబంధాలు.. నరేష్ ఎన్నోవాడో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: పవిత్ర లోకేష్.. ప్రస్తుతం ఈ పేరు గురించి తెలియని వారు ఉండరు. ఎందుకంటే పవిత్ర లోకేష్, నరేష్ పేర్లు అంతగా సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాబట్టి. తాజాగా ఈ జంట పెళ్లి కూడా చేసుకున్నట్లు నరేష్ ప్రకటించాడు. అయితే ఈ విషయాలు పక్కన పెడితే పవిత్ర.. నరేష్ కంటే ముందు ఇద్దరితో సహజీవనం చేసిందనే వార్తలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. వాస్తవానికి నరేష్ కంటే ముందు కన్నడ నటుడు సుచేంద్రా ప్రసాద్‌తో ఆమె వివాహం జరిగింది అనే వార్తలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.

కానీ ఆమె మాత్రం సుచేంద్రాతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది. అయితే మరో సారి పవిత్ర పవిత్రబంధాలు తెరపైకి వచ్చాయి. ఆమె గతంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకుందని తర్వాత అతనితో విడాకులు తీసుకుని సుచేంద్ర అనే వ్యక్తితో సహజీవనం చేసింది అనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2018 లో అతడితో విడిపోయి నరేష్‌తో రిలేషన్‌లో ఉందని తెలుస్తోంది. కాగా.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే పవిత్ర స్పందించాల్సి ఉంది.

Next Story