వీర మాస్ లెవల్‌లో ‘వీరసింహారెడ్డి’ 100 డేస్ సెలబ్రేషన్స్

by Kodari Anjali |   (  Updated:2025-08-28 14:49:00  IST  )

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

వీర మాస్ లెవల్‌లో ‘వీరసింహారెడ్డి’ 100 డేస్ సెలబ్రేషన్స్
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన సినిమా బాలకృష్ణ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా ఎనిమిది కేంద్రాలలో విజయవంతంగా త్వరలోనే వంద రోజులు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఏప్రిల్ 23న ‘వీరసింహారెడ్డి.. వీర మాస్ బ్లాక్ బస్టర్ 100 డేస్ సెలబ్రేషన్స్’ పేరిట గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఈ వేడుకకు చిత్ర బృందంతోపాటు పలువురు అతిథులు హాజరుకానున్నారు.

Next Story