పవన్ కల్యాణ్‌ ఫ్యాన్‌కు ‘OG’ టీమ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

by Disha Web Desk 2 |
పవన్ కల్యాణ్‌ ఫ్యాన్‌కు ‘OG’ టీమ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో ఒప్పుకున్న సినిమా షూటింగ్‌లను అతి త్వరలో పూర్తి చేసేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్రంగా కష్టపడుతున్నారు. ఒకేసారి అటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ఇటు ఓజీ సినిమా షూటింగ్స్‌లో గ్యాప్ లేకుండా పాల్గొంటున్నాడు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో వస్తోన్న ఓజీ షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. అయితే, ఓజీ టీమ్ రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. దీనికి ఓజీ టీమ్ నుంచి బిర్యానీ ప్లాన్ చెయ్ అంటూ ఓ పవన్ కల్యాణ్ ఫ్యాన్ కామెంట్ చేశాడు. దీనికి టీమ్ స్పందించి, అతని అడ్రస్ కనుక్కొని బిర్యానీ పంపించింది. తనను వెతుక్కుంటూ వచ్చిన బిర్యానీని రిసీవ్ చేసుకున్న అభిమాని.. ‘బిర్యానీ అందింది. మా పవన్ కల్యాణ్ అన్నను జాగ్రత్తగా చూసుకోండి’ అని ఫొటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. దీనిని పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Also Read..

మళ్లీ ఫామ్‌లోకి మెగాస్టార్.. 100 రోజులు పూర్తవుతున్న థియేటర్‌ల్లో ఆగని ‘వాల్తేరు వీరయ్య’ సందడి


Next Story