- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవర్ స్టార్ అభిమానులకు షాకిచ్చిన ‘ఓజీ ’ మూవీ మేకర్స్.. ట్రైలర్ విడుదలపై బిగ్ ట్విస్ట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న మూవీ ‘ఓజీ’(OG).

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న మూవీ ‘ఓజీ’(OG). సుజీత్ (Sujeeth)దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 25న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్, సాంగ్ సంచలనం సృష్టించాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినీ ప్రియులంతా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 21న ఉదయం 10:08గంటలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సమయం అసన్నమైనప్పటికీ ట్రైలర్ రాకపోవడంతో అభిమానులు అయోమయంలో పడిపోయారు.
ఈ నేపథ్యంలోనే.. తాజాగా, చిత్రబృందం ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘ఓజీ’ ట్రైలర్ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అభిమానులను నిరాశకు గురి చేస్తూ.. ఈ రోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరగబోయే కాన్సర్ట్‌లో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇక అది చూసిన నెటిజన్లు, అభిమానులు.. ఊరించి ఊసురుమనించారని నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అలాగే సాయంత్రం అయినా రిలీజ్ చేస్తారా? లేక చేయరా అని అంటున్నారు. హైప్‌తోనే చచ్చేలా ఉన్నాం అని కామెంట్లు పెడుతున్నారు. కాగా.. డీవీవీ ఎంటర్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఇక పవన్ సరసన ప్రియాంక మోహన్ రొమాన్స్ చేయనుంది.






