Power Star Pawan kalyan : ‘OG’ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్‌మోంట్

by Dishafeatures1 |
Power Star Pawan kalyan : ‘OG’ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్‌మోంట్
X

దిశ, సినిమా: పవన్ కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రలో ‘OG’ ఒకటి. సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రానికి డీవీవీ ఎంటర్టైన్మెంట్ మీద దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇంకా చాలా పెండింగ్‌లో ఉందన్న సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత ఈ సెట్స్‌లోకి రానున్నాడు పవన్ కళ్యాణ్. అంతవరకు పవన్ కళ్యాణ్ లేని సీన్లను సుజిత్ కంప్లీట్ చేస్తూ వస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ విలనిజం, శ్రియా రెడ్డి పాత్రలు హైలెట్‌గా నిలుస్తాయని టాక్.

ఇక పోతే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ మీద గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు మేకర్స్ అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా ఓ అదిరిపోయే పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. కాగా ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Next Story