- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పిసాసు-2’ సినిమాలో న్యూడ్ సీన్స్.. అతన్ని నమ్మి చేశానంటూ ఆండ్రియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆండ్రియా జెర్మియా (Andrea Jeremiah)వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

దిశ, సినిమా: ఆండ్రియా జెర్మియా (Andrea Jeremiah)వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల ‘మాస్క్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఈ భామ త్వరలో ‘పిసాసు-2’(Pisasu 2)తో రాబోతుంది. ఈ మూవీ ‘పిసాసు’కు సీక్వె్ల్‌గా తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మిస్కిన్(Miskin) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ హారర్ థ్రిల్లర్‌లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi)కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ‘పిసాసు- 2’ ను రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై టి మురుగనాథం నిర్మిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.
పలు కారణాల వల్ల రిలీజ్‌ను వాయిదా వేశారు. అయితే అందుకు కారణం ఆండ్రియా ఇందులో న్యూడ్‌గా నటించడమే అని పలు వార్తలు వస్తున్నాయి. ఇందులో పలు సీన్స్ ఉండటంతో సెన్సార్ విడుదలను అడ్డుకున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండ్రియా అసలు ‘పిసాసు-2’ లో న్యూడ్‌గా నటించిందో లేదో వెల్లడించింది. ‘‘పిసాసు-2 కథ రాస్తున్నప్పుడు న్యూడ్ సీన్స్ ఉన్నాయని రాశారు. కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు మిస్కిన్ ఆ సన్నివేశాలను తొలగించారు. ఈ సినిమాలో శృంగార సన్నివేశాలున్నాయి.
కానీ నగ్నత్వం లేదు. మిస్కిన్ సర్ మనుగడ కోసం నేను ఈ మూవీని చేయట్లేదు. అతను స్టార్ హీరోలతో చాలా సినిమాలు చేశాడు. అలాంటి దర్శకుడు నన్ను పిసాసు-2లో పాత్ర చేయమని అడుగుతుంటే నేను ఒప్పుకున్నాను. అతన్ని నమ్మి ఇందులో నటించాను. అతను చాలా నగ్నత్వ సీన్లు రాశాడు కానీ షూట్ చేయలేదు. ‘పిసాసు-2’లో ఎక్కువగా సెక్స్ సీన్లు ఉన్నాయి’’ అని చెప్పింది. నిర్మాతగా మారిన ఆండ్రియా ఈ సినిమాను త్వరలోనే తాను విడుదల చేయిస్తానని వెల్లడించింది.






