ఎన్టీఆర్ కొత్త సినిమా సెట్స్‌పైకి అప్పుడే..!

by Dishanational4 |
ఎన్టీఆర్ కొత్త సినిమా సెట్స్‌పైకి అప్పుడే..!
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగెస్ట్ హిట్ సాధించిన సినిమా ''ఆర్‌ఆర్‌ఆర్''. ఆ విజయంతో పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో జోడికట్టారు. వీరిద్దరి కాంబీనేషన్‌లో వస్తున్న ఎన్టీఆర్ 31వ సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైనా ఎన్టీఆర్ ఫస్ట్‌ లుక్ అభిమానులను మిస్మరైజ్ చేస్తుంది. అందులో గడ్డం, భీకరమైన లుక్‌లో ఎన్టీఆర్ కనిపించారు. తాజాగా ఈ సినిమా నుండి మరో అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌. ఏప్రిల్ 2023 నుంచి ఎన్టీఆర్ 31 షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. నేను సినిమా గురించి చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నానని.. దయచేసి ఆ సినిమా గురించి మరిన్ని విషయాలు నన్ను అడగొద్దని తెలిపారు. ఎందుకంటే అది ప్రస్తుతానికి చాలా దూరంలో ఉందని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తదుపరి సినిమాకు డైరెక్టర్ కొరటాల శివకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

'లైగర్' ఇండియాను షేక్ చేస్తుంది.. విజయ్ దేవరకొండ



Next Story

Most Viewed