జూనియ‌ర్‌ ఎన్టీఆర్ షాకింగ్ లుక్.. ఫోటోలు వైర‌ల్‌

by velandi.Saikiran |

డ్రాగన్ అనే టైటిల్ కూడా దాదాపు ఫైనల్ అయినట్లే. ఈ సినిమాలో కాంతార బ్యూటీ రుక్మిణి వ‌సంత్ ( Rukmini Vasanth ) హీరోయిన్ గా

జూనియ‌ర్‌ ఎన్టీఆర్ షాకింగ్ లుక్.. ఫోటోలు వైర‌ల్‌
X

దిశ‌, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్, ప్రపంచవ్యాప్తంగా తన స్థాయిని పెంచుకున్నాడు. ఇటీవల దేవర సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. డ్రాగన్ అనే టైటిల్ కూడా దాదాపు ఫైనల్ అయినట్లే. ఈ సినిమాలో కాంతార బ్యూటీ రుక్మిణి వ‌సంత్ ( Rukmini Vasanth ) హీరోయిన్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన కొత్త లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ చాలా స్లిమ్ గా కనిపించాడు. గడ్డం పెంచి, కరెంటు తీగలాగా మెరిశాడు. అయితే డ్రాగన్ సినిమా కోసమే, జూనియర్ ఎన్టీఆర్ ఇలా స‌న్న‌గా మారిన‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. కాగా ఎన్టీఆర్‌-ప్ర‌శాంత్ నీల్ సినిమా వ‌చ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Next Story