‘వార్-2’ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్.. యుద్ధం మొదలైపోయిందంటూ పోస్ట్.. సోషల్ మీడియా షేక్

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-15 15:39:13  IST  )

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘వార్-2’(war-2).

‘వార్-2’ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్.. యుద్ధం మొదలైపోయిందంటూ పోస్ట్.. సోషల్ మీడియా షేక్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘వార్-2’(war-2). అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు-14న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, లవ్ సాంగ్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ‘వార్-2’పై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. అప్డేట్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా? అని ఎదురుచూస్తున్నారు.

ఈక్రమంలో.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య ఒక డాన్స్ నెంబర్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అది సినిమాకే హైలెట్‌గా నిలవనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్ కూడా విడుదల తేదీ దగ్గర పడటంతో వరుస అప్డేట్స్ షేర్ చేస్తున్నారు. తాజాగా, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వార్-2’ అప్డేట్‌ను తారక్ విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో ‘జనాబ్ ఈ అలీ’ అనే మాస్ టీజర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ పోస్ట్‌కు ‘‘మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న డ్యాన్స్ వచ్చేసింది. యుద్ధం కూడా ప్రారంభం అయింది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక ఇందులో ఇద్దరు స్టార్ హీరోల డ్యాన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తెంది. ఎవరికి వారు తమ బాడీలను స్ప్రింగ్‌లా వంచేసి అద్భుతమైన పర్ఫామెన్స్‌తో దుమ్మురేపారు. ముఖ్యంగా ఇద్దరిలో ఎవరినిక చూడాలో అర్థం కాక ఆడియన్స్ తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ పాట సినిమా మొత్తానికే హైలెట్ కావడంతో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక ఆ మొత్తం పాటను థియేటర్లలోనే చూడాలని ఎన్టీఆర్ వెల్లడించారు.

Next Story