- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓజీ-2 కాదు.. అది ఓజాస్ గంభీర ప్రీక్వెల్! సుజిత్ షాకింగ్ డెసిషన్.
సుజిత్ తన ఫోకస్ మొత్తం మళ్లీ ‘ఓజీ’ ప్రపంచం పైనే పెట్టారట. ఈ రెండో భాగం మొదటి భాగానికి సీక్వెల్ కాదు, అంతకంటే ముందే జరిగిన ‘ఓజాస్ గంభీర’ గతాన్ని చూపించే ప్రీక్వెల్ అని తెలుస్తోంది.

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్ కలయికలో వచ్చిన ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ఈ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా విడుదలైన మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని, పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచింది. సుజిత్ విజన్, థమన్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ అగ్నిపర్వతం లాంటి పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమా అభిమానులకు ఒక భారీ సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘ఓజీ’కి ఒక ప్రీక్వెల్ రాబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే, సుజిత్ తన తర్వాతి చిత్రాన్ని నానితో ‘బ్లడీ రొమియో’ చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి వాయిదా పడటంతో, సుజిత్ తన ఫోకస్ మొత్తం మళ్లీ ‘ఓజీ’ ప్రపంచం పైనే పెట్టారట. ఈ రెండో భాగం మొదటి భాగానికి సీక్వెల్ కాదు, అంతకంటే ముందే జరిగిన ‘ఓజాస్ గంభీర’ గతాన్ని చూపించే ప్రీక్వెల్ అని తెలుస్తోంది.
ముంబై అండర్ వరల్డ్ సామ్రాజ్యంలో ఓజాస్ ఒక సామాన్యుడి నుంచి తిరుగులేని డాన్‌గా ఎలా ఎదిగాడు? అతని ప్రయాణంలో ఎదురైన చీకటి కోణాలు ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారట. ప్రీక్వెల్ కావడంతో ఇందులో పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు కొత్త నటీనటులు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారట. మొదటి భాగంలో మనం చూసిన యాక్షన్ సీక్వెన్స్ కేవలం శాంపిల్ మాత్రమేనని, ఈ రెండో భాగంలో అంతకు మించిన విధ్వంసం ఉంటుందని ఇన్సైడ్ టాక్. దీని కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను కూడా సంప్రదిస్తున్నట్లు సమాచారం. సుజిత్ ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఓజీ’లో పవన్ కళ్యాణ్ మౌనంలో ఉన్న పవర్‌ను చూసిన ఫ్యాన్స్, ఇప్పుడు గతాన్ని వివరించే ఈ ప్రీక్వెల్‌లో ఆయన విశ్వరూపాన్ని చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ‘ఓజీ’ మానియా మళ్లీ మొదలవ్వబోతోంది!






