- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాటలు లేవు కేవలం అనుభూతులే.. పెళ్లి జ్ఞాపకాలను పంచుకుంటూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎమోషనల్
పెళ్లి తిరుపతిలో ఎంతో సాంప్రదాయబద్ధంగా జరిగింది. కావ్య నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితమే ఒక 'శ్రీనివాస కావ్యం'లా మారిపోయింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల తన బ్యాచ్‌లర్ లైఫ్‌కు స్వస్తి పలికి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన చిరకాల ప్రియురాలు కావ్య రెడ్డితో కలిసి పెద్దల సమక్షంలో ఆయన ఏడడుగులు వేశారు. వీరిద్దరి వివాహం ఏప్రిల్ 29న పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత వైభవంగా, సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. తిరుమలలో జరిగిన ఈ వివాహ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే, అనంతరం హైదరాబాద్‌లో జరిగిన వివాహ రిసెప్షన్ మాత్రం సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల సమక్షంలో కన్నుల పండువగా సాగింది. తాజాగా, తన పెళ్లికి సంబంధించిన అందమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సాయి శ్రీనివాస్, దానికి జత చేసిన క్యాప్షన్ అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది."నా పెళ్లి తిరుపతిలో ఎంతో సాంప్రదాయబద్ధంగా జరిగింది. కావ్య నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితమే ఒక 'శ్రీనివాస కావ్యం'లా మారిపోయింది.
ఈ అనుభూతి సాక్షాత్తు ఆ శ్రీనివాస కళ్యాణానికి దగ్గరగా అనిపించింది" అని ఆయన ఎమోషనల్ అయ్యారు.పెళ్లి వీడియోను షేర్ చేస్తూ శ్రీనివాస్ ఇలా రాసుకొచ్చారు.. "ప్రతి అందమైన క్షణానికి మాటలు అవసరం లేదు. కొన్నింటిని నిశ్శబ్దంగా అనుభూతి చెందాలి. జీవితంలోని ఈ దశ నాకు ఎప్పటికీ హృదయానికి దగ్గరగా ఉండే జ్ఞాపకాలను, భావోద్వేగాలను, వ్యక్తులను ఇచ్చింది. ఈ ప్రయాణమంతటిలో మమ్మల్ని చుట్టుముట్టిన ప్రేమకు, ఆప్యాయతకు, ఆశీర్వాదాలకు ఎప్పటికీ కృతజ్ఞుడిని. మన ఐక్యతకు, శాశ్వతానికి శుభాకాంక్షలు." అని రాసుకొచ్చాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని ఎంతో పద్ధతిగా జరుపుకున్న శ్రీనివాస్‌ను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కావ్య రెడ్డితో ఆయన కెమిస్ట్రీ వీడియోలో చాలా క్యూట్‌గా ఉందని, కొత్త జంట నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఫ్యాన్స్ దీవిస్తున్నారు. ప్రస్తుతం ఈ ‘శ్రీనివాస కావ్యం’ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.






