హిట్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్న నితిన్.. బ్లాక్ బస్టర్ హిట్ లోడింగ్ అంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

యంగ్ హీరో నితిన్(Nithiin) గత కొద్ది కాలంగా హిట్, ఫ్లాప్ అనకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.

హిట్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్న నితిన్.. బ్లాక్ బస్టర్ హిట్ లోడింగ్ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: యంగ్ హీరో నితిన్(Nithiin) గత కొద్ది కాలంగా హిట్, ఫ్లాప్ అనకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల తమ్ముడు, రాబిన్ హుడ్ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఒక్క హిట్ అందుకోలేకపోయాడు. ఎంతో కష్టపడినప్పటికీ బాక్సాఫీసు వద్ద నిరాశే మిగులుతోంది. ప్రస్తుతం హిట్ కోసం తాపత్రయ పడుతూ కథలు వింటున్నాడు. తాజాగా, డైరెక్టర్ సాయి మార్తాండ్(Sai Marthand) కథను విన్నట్లు సమాచారం. ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన మరో స్టోరీ సిద్ధం చేయగా.. అది నితిన్‌కు నచ్చడంతో ఓకే చేసినట్లు టాక్. ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయమని అంటున్నారు.

Next Story