సోదరుడితో SEX చేయలేదు.. దయచేసి పుకార్లు ఆపండి.!

by Dishanational4 |
సోదరుడితో SEX చేయలేదు.. దయచేసి పుకార్లు ఆపండి.!
X

దిశ, సినిమా: సోదరుడితో అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణలను కొట్టిపారేసింది టెలివిజన్ యాక్ట్రెస్ నిషా రావల్. భర్త కరణ్ మెహ్రాతో ప్రస్తుతం విడాకుల కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా కరణ్ సానూభూతి అనే కార్డ్ వాడుతూ తనపై బురద జల్లుతున్నాడని.. ఇకనైనా నిరాధారమైన, అనాగరికమైన నిందలతో పాటు తన డ్రామాలు కూడా ఆపాలని కోరింది.

ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితంలో ఏమి చేస్తున్నానో ఎవరికీ సమాధానం చెప్పలేనని చెప్పింది. అలాగే మీడియా కూడా తనను ట్రోల్ చేయడం మానేయాలని, భవిష్యత్తులో తన బిడ్డ ఈ విషయాలన్నీ తెలుసుకుని ఆందోళనకు గురవుతాడని భయపడుతున్నట్లు వెల్లడించింది. అలాగే బిడ్డను శాంతియుతంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచాలని కోరుకుంటున్నానన్న ఆమె.. కరణ్ అదే కోరుకుంటే వెంటనే ఈ విషయంలో వెనక్కి తగ్గాలని చెప్పింది. చివరగా తాను చేసేది మొత్తం బిడ్డ కోసమేనని, కరణ్‌ ఏదైనా చేయాలనుకుంటే చట్టప్రకారమే నడుచుకోవాలన్న నిషా.. అంతా శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నట్లు ముగించింది.


Next Story

Most Viewed