మద్యం మత్తులో నటి ఇంటికెళ్లిన హీరో.. బలవంతంగా డోర్ తీసి

by Disha Web Desk 10 |
మద్యం మత్తులో నటి ఇంటికెళ్లిన హీరో.. బలవంతంగా డోర్ తీసి
X

దిశ, సినిమా : ప్రముఖ సీనియర్ నటి నిర్మల యవ్వనంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. నాలుగు భాషల్లో దాదాపు 400 సినిమాలకు‌పైగా చిత్రాల్లో నటించిన ఆమె.. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో కెరీర్ అనుభవాలను షేర్ చేసుకుంది. ‘అప్పట్లో నాకు ఊహించని సంఘటన ఎదురైంది. ఓ సినిమా షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లాను. అయితే ఫుల్‌గా మద్యం తాగిన ఓ హీరో నన్ను ఫాలో అవుతూ మా ఇంటికి వచ్చి నానా హంగామా చేశాడు. తలుపు తెరవాలంటూ గట్టిగా అరిచాడు. నేను ఎంతకీ స్పందించకపోవడంతో.. ‘ప్లీజ్ నేను ఏమీ చేయను. కాసేపు పడుకుని వెళ్లిపోతా’ అంటూ రిక్వెస్ట్ చేశాడు. అయినా నేను పట్టించుకోలేదు. రాత్రి జరిగినదంతా పొద్దున్నే దర్శకనిర్మాతలకు చెప్పాను. వాళ్లంతా నాకు సపోర్ట్ చేయకుండా నా నోరుమూయించే ప్రయత్నం చేశారు. దీంతో ఇలాంటి పనులు నాకు నచ్చవని చెప్పి సినిమా నుంచి తప్పుకున్నా’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంది.

Also Read: Karthik Nair: కార్తికకు అరుదైన గౌరవం.. యూఏఈ నుంచి గోల్డెన్‌ వీసా



Next Story

Most Viewed