ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ నుంచి ‘నిన్ను చూసిన..’ సాంగ్ రిలీజ్

by Mallepaka Hamsa |

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి(Shruti Shetty), ఆనంద్(Anand) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్కై’(Sky).

ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ నుంచి ‘నిన్ను చూసిన..’ సాంగ్ రిలీజ్
X

దిశ, సినిమా: మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి(Shruti Shetty), ఆనంద్(Anand) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్కై’(Sky). ఈ సినిమాను వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్నారు. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘స్కై’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈక్రమంలో.. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నిన్ను చూసిన..’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ పాటకు పృథ్వీ పెరిచెర్ల మంచి లిరిక్స్ రాయగా, మనీష్ కుమార్, వైష్ణవి ఆకట్టుకునేలా పాడారు. శివప్రసాద్ బ్యూటిఫుల్ ట్యూన్‌తో కంపోజ్ చేశారు. ‘స్కై’ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ‘తపనే తెలుపగ..’, ‘పోయేకాలం నీకు..’ సాంగ్స్ ఛాట్ బస్టర్స్‌గా మారి మిలియన్ వ్యూస్ రీచ్ అయ్యాయి. ఇక ‘నిన్ను చూసిన..’ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ ఆదరణ పొందుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

Next Story