- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాలపై నిఖిల్ కామెంట్స్
సాధారణంగా యంగ్ హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలని ఆరాటపడుతుంటారు. కానీ నిఖిల్(Nikhil Siddharth) మాత్రం తన రూట్ మార్చుకున్నారు. ‘

దిశ, సినిమా: సాధారణంగా యంగ్ హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలని ఆరాటపడుతుంటారు. కానీ నిఖిల్(Nikhil Siddharth) మాత్రం తన రూట్ మార్చుకున్నారు. ‘‘మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి వారు ఒక సినిమా కోసం ఏళ్ల తరబడి శ్రమిస్తున్నారు. ఫలితంగానే 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి ప్రపంచ స్థాయి సినిమాలు వస్తున్నాయి. వారిని చూశాక నాకు ఒక విషయం అర్థమైంది.. ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా ఇవ్వాలంటే సమయం పడుతుంది’’ అని నిఖిల్ పేర్కొన్నారు. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభు’ ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
క్వాలిటీ కోసం స్టార్ హీరోల బాటలోనే తాను కూడా పయనిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘స్వయంభు’తో రాబోతున్న నిఖిల్, ఈ విరామంపై ఆసక్తికర వివరణ ఇచ్చారు. ‘‘ప్రభాస్(Prabhas), ఎన్టీఆర్, మహేష్ బాబు (Mahesh Babu)వంటి స్టార్ హీరోలు ఒక్కో సినిమా కోసం 2-3 ఏళ్ల సమయం తీసుకుంటున్నారు. వాళ్ళు అంత సమయం తీసుకుంటున్నప్పుడు, ఒక మంచి క్వాలిటీ సినిమా ఇవ్వడానికి నేను ఎందుకు తీసుకోకూడదు?" అని ఆయన ప్రశ్నించారు. పెద్ద హీరోల అంకితభావాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ప్రేక్షకులకు ఒక విజువల్ వండర్ అందించాలనే ఉద్దేశంతోనే ఈ రెండేళ్లు కష్టపడ్డానని నిఖిల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట చర్చకు దారితీస్తున్నాయి.






