వరుసపెట్టి పాన్ ఇండియ‌న్ సినిమాల్లో నటిస్తున్న Nikhil..

by Disha Web Desk 10 |
వరుసపెట్టి పాన్ ఇండియ‌న్ సినిమాల్లో నటిస్తున్న Nikhil..
X

దిశ, సినిమా: చిన్న మూవీతో వచ్చి.. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియ‌న్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్‌. కృష్ణత‌త్వంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవడంతోపాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. దీంతో అతను ప్రస్తుతం డిఫరెంట్ కటెంట్‌ కలిగిన వరుస పాన్ ఇండియ‌న్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా సుభాష్ చంద్రబోస్ మ‌ర్డర్ మిస్టరీ బ్యాక్‌ డ్రాప్‌లో ‘స్పై’ అనే మూవీ చేస్తున్నాడు. అలాగే రామ్‌చ‌ర‌ణ్ ప్రొడ‌క్షన్‌లో ‘ది ఇండియా హౌజ్’ సినిమాకు కడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా తన బర్త్ డే సందర్భంగా ‘స్వయంభూ’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఇందులో నిఖిల్‌ పోరాట యోధుడిగా క‌నిపించనున్నాడు. దీని ఫ‌స్ట్‌ లుక్‌ పోస్టర్ సోష‌ల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. వీటన్నింటితోపాటు ‘కార్తికేయ’ సిరీస్‌లో మూడో భాగం కూడా తెర‌కెక్కించేందుకు నిఖిల్‌, చందూ మొండేటి స‌న్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నిఖిల్.

Also Read..

జైపూర్‌లో హీరో శర్వానంద్ పెళ్లి సందడి షురూ.. హల్దీ (వీడియో)

Next Story

Most Viewed