‘స్వయంభు’ విడుదల తేదీ ప్రకటించిన నిఖిల్.. రెండు సంవత్సరాల కష్టం.. వేల సవాళ్లు అంటూ పోస్ట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha)ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్వయంభు’(Swayambhu).

‘స్వయంభు’ విడుదల తేదీ ప్రకటించిన నిఖిల్.. రెండు సంవత్సరాల కష్టం.. వేల సవాళ్లు  అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha)ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్వయంభు’(Swayambhu). భరత్ కృష్ణమాచారి (Bharat Krishnamachari)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో నిఖిల్ యోధుడిగా కనిపించబోతున్నారు. సంయుక్త మీనన్(Samyuktha Menon), నభానటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రాబోతుంది. చాలాకాలంగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని భారీ అంచనాలను పెంచాయి.

కానీ విడుదల తేదీ ప్రకటించకుండా నిఖిల్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా సైలెంట్‌గా ఉన్నారు. దీంతో ‘స్వయంభు’ వాయిదా పడిందని అంతా నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో.. తాజాగా, నిఖిల్ ‘స్వయంభు’ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఇస్తూ ఓ వీడియోను షేర్ చేసి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ‘‘ఒక్క సినిమా.. రెండేళ్ల కష్టం.. పదుల సంఖ్యలో సెట్లు, అదొక సామ్రాజ్యం. వేల కొద్దీ సవాళ్లు, అదొక యుద్ధం, లక్షల మంది ప్రేక్షకులు. మాకున్న ఒకే ఒక్క లక్ష్యం. మా నిర్మాతలు భువన్, శ్రీకర్‌ల నమ్మకం.

ఇదే మా స్వయంభు. మన భారతదేశ చరిత్రకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయ్. అవి ఒట్టి రాజుల కథలో యుద్ధ గాధలో మాత్రమే కాదు అవి మన సంస్కృతికి పునాదులు. ఆ చరిత్రలో చెప్పని గొప్ప వీరుడి కథే ఈ స్వయంభు’’ అని చెప్పుకొచ్చాడు. అలాగే షూటింగ్ పూర్తి అయినట్లు తెలిపాడు. ఈ చిత్రాన్ని మహాశివరాత్ని సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, చైనీస్, స్పానిష్, అరబిక్ మొత్తం 8 భాషల్లో విడుదల కాబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఆనందపడుతున్నారు.

link

Next Story