ఆ పని ఇష్టంగా ఎవరితో చేసావంటూ నటిని ఓపెన్‌గా అడిగేసిన నిహారిక.. (వీడియో)

by Disha Web Desk 6 |
ఆ పని ఇష్టంగా ఎవరితో చేసావంటూ నటిని ఓపెన్‌గా అడిగేసిన నిహారిక.. (వీడియో)
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది. నిత్యం తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంది. ఇటీవల ఆమె వెకేషన్స్‌కు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చింది. కానీ ప్రస్తుతం తన సినీ కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టి నటిగా, నిర్మాతగా యాంకర్‌గా ఫుల్ బిజీ అయిపోయింది. అయితే నిహారిక యాంకర్‌గా వ్యవహరిస్తున్న ‘చెఫ్ మంత్ర కుకింగ్ షో సీజన్‌-3 రాబోతున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోకు అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ సినిమా హీరో సుహాస్, నటి శరణ్య పాల్గొన్నారు.

ఇక వారికి వెల్ కమ్ చెప్పిన నిహారిక ఆ తర్వాత వింత ప్రశ్నలు ఉన్న పేపర్లను తమకే ఇచ్చి చదవమని చెప్పింది. మొదట సుహాస్ చదివాడు. అందులో మీరు డ్యాష్ లేకపోతే ఉండలేరా? అనేది ఉంది. ఇక అది చూసిన హీరో నవ్వుకుంటాడు. ఆ తర్వాత శరణ్యకు ఇంకో బోల్డ్ ప్రశ్న ఎదురవుతుంది. అదేంటంటే.. ‘మీరు ఇష్టంగా డ్యాష్ చేసింది ఎవరితో? అని అందులో ఉంటుంది. శరణ్యకు వచ్చిన ప్రశ్న చూసి ‘ఆయనే చేస్తారు పాపం’ అని సుహాస్ సెటైర్ వేశారు. దీనికి శరణ్య ’నీకు దండం పెడతా‘ అంటూ సుహాస్​ను ఆపేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత నిహారిక వీరిద్దరితో స్పెషల్ వంటకాలు చేయిస్తుంది. మధ్యలో పలు ప్రశ్నలు కూడా వేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుండగా అది చూసిన వారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా దీని పూర్తి ఎపిసోడ్ మార్చి- 15న రాబోతుంది.




Next Story

Most Viewed