న్యూసెన్స్ : స్మగ్లింగ్ వెనుక రాజకీయ నాయకుడి హస్తం.. బలమున్నోడికి మొక్కాలా?

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-15 17:36:47  IST  )

‘ఆహా’ ఒరిజినల్స్‌గా వస్తున్న ‘న్యూసెన్స్’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

న్యూసెన్స్ : స్మగ్లింగ్ వెనుక రాజకీయ నాయకుడి హస్తం.. బలమున్నోడికి మొక్కాలా?
X

దిశ, సినిమా : ‘ఆహా’ ఒరిజినల్స్‌గా వస్తున్న ‘న్యూసెన్స్’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మీడియా, పోలీసు, రాజకీయం చుట్టూ తిరిగే కథలో.. బలమున్నోడికి చేతులు మొక్కాలి కానీ రాళ్లు వేసి అనవసరంగా రెచ్చగొట్టద్దనేది సారాంశం. నవదీప్, బిందు మాధవి కీలకపాత్రల్లో కనిపించనున్న సినిమా ‘డబ్బుకు మీడియా దాసోహమా?’ అనే పాయింట్‌తో సాగుతున్నట్లు తెలుస్తోంది. ‘ఇక్కడ ఎవడి సొమ్ము ఎవడు తినట్లే.. ఎవడి దమ్ము వాడిదే’ అనే డైలాగ్స్ ఆసక్తిరేపుతుండగా.. మొత్తానికి ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేసింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్ మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

Next Story