న్యూ బిగినింగ్స్, ఫీలింగ్స్.. ‘8 వసంతాలు’ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన చిత్రబృందం

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-03 11:43:28  IST  )

యంగ్ బ్యూటీ అనంతిక సనీల్‌కుమార్(Anantika Sunilkumar) ‘మ్యాడ్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

న్యూ బిగినింగ్స్, ఫీలింగ్స్.. ‘8 వసంతాలు’ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన చిత్రబృందం
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అనంతిక సనీల్‌కుమార్(Anantika Sunilkumar) ‘మ్యాడ్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘8 వసంతాలు’ (8Vasantalu )చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీరా కిశోర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫణీంద్ర(Phanindra) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బ్యూటీఫుల్ బ్రేకప్‌ స్టోరీతో రాబోతోన్న ఈ చిత్రంలో అనంతిక శుద్ధి అయోధ్య పాత్రలో కనిపించనుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ‘8 వసంతాలు’ చిత్రం జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ జూన్ 7న రాబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేసి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇక ఇందులో హీరోయిన్ అనంతిక చీరలో కనిపించి అందరికీ మెస్మరైజ్ చేసింది.

Next Story