- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెటిజన్ల ట్రోల్స్ ఎఫెక్ట్.. ‘రామాయణ’ నుండి కాజల్ అవుట్.. లక్కీ చాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’(Ramayana).

దిశ, సినిమా: బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’(Ramayana). ఇందులో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), సాయి పల్లవి రాముడు, సీత పాత్రలో కనిపించనున్నారు. అలాగే యశ్- రావణుడు, సన్నీ డియోల్(Sunny Deol)- హనుమంతుడు, రవి దుబే- లక్ష్మిణుడు పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను నితేష్ తివారీ(Nitesh Tiwari) తెరకెక్కిస్తుండగా.. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా రాక్షస రాజు రావణాసురుని భార్య మండోదరి పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించడంతో నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు.
ఈక్రమంలోనే కాజల్‌ను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లు గత కొద్ది కాలంగా పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమెను ఎంపిక చేసుకోక ముందు వరకు చాలా హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అయ్యేవట. కాజల్ వల్ల ట్రోల్స్ ఎఫెక్ట్ సినిమాపై పడుతుందని మూవీ మేకర్స్ కూడా ఆలోచించారట. ఈనేపథ్యంలో.. తాజాగా, చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మండోదరి పాత్ర కోసం మృణాల్ ఠాకూర్‌ను ఎంపిన చేసుకున్నట్లు టాక్. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మంచి నిర్ణయం అని అంటున్నారు.






