- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రీ కూతుళ్ల బంధంపై నెటిజన్ షాకింగ్ పోస్ట్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన చిన్మయి
నీ తండ్రే నిన్ను రేప్ చేసి ఉంటాడు.. అందుకే ఇలా మాట్లాడుతున్నావు.

దిశ, సినిమా: సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై కామెంట్స్ చేయడం కొన్నిసార్లు హద్దులు దాటుతుంటుంది. ముఖ్యంగా సామాజిక అంశాలపై గొంతు ఎత్తే సింగర్ చిన్మయి శ్రీపాద(Chinmayi Sripada)కు ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. తాజాగా ఒక నెటిజన్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేశాయి. ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం నేపథ్యంలో చిన్మయి చేసిన పోస్ట్‌పై ఒక వ్యక్తి అత్యంత దారుణంగా స్పందించడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్ స్టీన్ సెక్స్ స్కాండల్ గురించి చిన్మChinmayi Sripadaయి సోషల్ మీడియాలో స్పందిస్తూ భారతీయులను హెచ్చరించింది. ‘‘ప్రతి భవనంలోనూ ఎప్ స్టీన్‌లు ఉంటారు. మత పెద్దలను కూడా గుడ్డిగా నమ్మకండి. భారతదేశంలో లక్షలాది మంది బాల లైంగిక నేరస్థులు ఉన్నారు. మీకు తెలిసిన ఏ అమ్మాయినైనా అడగండి.. ఆమె మొదటిసారి ఏ వయసులో లైంగిక వేధింపులకు గురైందో చెబుతుంది’’ అని ఆమె రాసుకొచ్చింది. సమాజంలోని చేదు నిజాన్ని ఆమె ఎత్తిచూపింది.
చిన్మయి పోస్ట్‌పై స్పందించిన ఒక నెటిజన్ మానవత్వం మరిచి.. ‘‘నీ తండ్రే నిన్ను రేప్ చేసి ఉంటాడు.. అందుకే ఇలా మాట్లాడుతున్నావు’’ అంటూ దారుణమైన కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై చిన్మయి అంతే ధీటుగా స్పందించింది. తన తండ్రి తనను అలా చేయలేదని స్పష్టం చేస్తూనే.. ‘‘కూతుళ్లు తమ తండ్రులచే అత్యాచారం చేయబడతారని మీరు ఊహిస్తున్నారంటే.. మీ సంస్కృతి ఏంటో, మీరు పెరిగిన వాతావరణం ఏంటో అర్థమవుతోంది. మిమ్మల్ని పెంచిన విధానం మీ ప్రవర్తనలో కనిపిస్తోంది’’ అంటూ అతడికి బుద్ధి వచ్చేలా సమాధానం ఇచ్చింది. చిన్మయి ఇచ్చిన ఈ కౌంటర్‌కు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. కేవలం ఫేమ్ కోసం, ఒక మహిళా సెలబ్రిటీ మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించే ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని విమర్శలు ఎదురైనా, సమాజంలోని అన్యాయాలపై చిన్మయి గొంతు ఎత్తడం ఆపకపోవడం విశేషం. ప్రస్తుతం చిన్మయి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.






