రిటైర్మెంట్ తీసుకొని కొత్త హీరోలకు చాన్సులు ఇవ్వమన్న నెటిజన్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన షారుఖ్ ఖాన్

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-17 15:06:25  IST  )

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shahrukh Khan) ‘కింగ్’(king) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

రిటైర్మెంట్ తీసుకొని కొత్త హీరోలకు చాన్సులు ఇవ్వమన్న నెటిజన్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన షారుఖ్ ఖాన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shahrukh Khan) ‘కింగ్’(king) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల ఈ మూవీ షూటింగ్‌లో గాయపడిన ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటున్నాడు. ఈనేపథ్యంలో.. తాజాగా, షారుఖ్ ఖాన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఓ నెటిజన్ జిమ్‌లో గాయపడటం ఎక్కువ బాధపెడుతుందా? లేక ట్రోల్స్ చదవడమా అని అడగ్గా.. దీనికి షారుఖ్ డంబెల్స్ యాక్షన్ నా ఎముకలు విరగొట్టగలవు. కానీ విమర్శలు నన్ను బాధపెట్టలేవు. ఎందుకంటే నేను నా మనసులోనే సంగీతాన్ని వినడంలో చాలా బిజీగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు.

అలాగే అవార్డు రావడంపై స్పందిస్తూ.. అవార్డు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ దేశానికి రాజులా భావిస్తున్నాను. అవార్డు వచ్చాక నా గౌరవం మరింత పెరిగింది. అలాగే సినిమాల విషయంలో మరింత కష్టపడి రాణించాలనే బాధ్యత కూడా పెరిగింది’’ అని అన్నాడు. అలాగే ఓ నెటిజన్ రిటైర్‌మెంట్ తీసుకొని కొత్త హీరోలకు చాన్స్ ఇవ్వు అని పోస్ట్ పెట్టగా.. షారుఖ్ కౌంటర్ ఇచ్చాడు. మీ చైల్డిష్ ప్రశ్నల నుంచి మీరు బయటపడినప్పుడు మంచి మంచి ప్రశ్నలు అడగగలుగుతారు. అప్పటి వరకు దయచేసి మీరు తాత్కాలికంగా రిటైర్మెంట్ తీసుకోండి’’ అంటూ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం షారుఖ్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story