అల్లు అర్జున్ ప్రాపర్టీ అంటూ నెటిజన్ల కామెంట్స్.. ఘాటు రిప్లైతో కౌంటర్ ఇచ్చిన సీరత్ కపూర్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-12 14:27:03  IST  )

హార్ట్ ఎమోజీలు పెట్టినంత మాత్రాన ఆ కామెంట్ గౌరవప్రదంగా మారిపోదు. ఒక మహిళ ఎవరికీ ఆస్తి కాదు. ఆమెకు తనకంటూ సొంత కలలు, గొంతు, గుర్తింపు ఉంటాయి.

అల్లు అర్జున్ ప్రాపర్టీ అంటూ నెటిజన్ల కామెంట్స్.. ఘాటు రిప్లైతో కౌంటర్ ఇచ్చిన సీరత్ కపూర్
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై కామెంట్స్ చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. కానీ, కొందరు నెటిజన్లు హద్దులు దాటి ప్రవర్తించినప్పుడు తారలు కూడా అంతే గట్టిగా బుద్ధి చెబుతుంటారు. తాజాగా నటి సీరత్ కపూర్ విషయంలో ఇదే జరిగింది. తనను అల్లు అర్జున్ ప్రాపర్టీ అని ఓ నెటిజన్ చేసిన కామెంట్‌పై ఆమె స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు సీరత్ ఒక ప్రైవేట్ జెట్ ఫోటోను షేర్ చేయడమే ఈ వివాదానికి కారణం. ఆ ఫోటోలో బన్నీతో ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి, కొందరు నెటిజన్లు వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ రకరకాల కథలు అల్లారు. ఈ క్రమంలోనే ఒక యూజర్ ఏకంగా ఆమెను "అల్లు అర్జున్ ప్రాపర్టీ" అని సంబోధించడంతో వివాదాస్పదమైంది. అది గమనించిన సీరత్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఘాటుగా స్పందిస్తూ.. "హార్ట్ ఎమోజీలు పెట్టినంత మాత్రాన ఆ కామెంట్ గౌరవప్రదంగా మారిపోదు. ఒక మహిళ ఎవరికీ ఆస్తి కాదు. ఆమెకు తనకంటూ సొంత కలలు, గొంతు, గుర్తింపు ఉంటాయి.

ఎవరినైనా అభిమానించేటప్పుడు గౌరవంతో ఉండండి.. కానీ సొంతం భావించొద్దు" అని స్పష్టం చేశారు. కేవలం గ్లామర్ గర్ల్ అని ముద్ర వేసి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడే సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని ఆమె ఆకాంక్షించారు. ట్రోలర్స్ నోరు మూయించడానికి సెలబ్రిటీలు కూడా ఎంత హుందాతనంతో వ్యవహరించవచ్చో సీరత్ నిరూపించారు. వివాదాలు ఒకవైపు ఉన్నా, సీరత్ కపూర్ తన కెరీర్‌ను మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. 'రన్ రాజా రన్'తో మనందరినీ పలకరించిన ఈ బ్యూటీ, ఇప్పుడు 'సేవ్ ది టైగర్స్' వంటి హిట్ సిరీస్‌లతో తనలోని కామెడీ టైమింగ్‌ను కూడా చూపిస్తున్నారు. ఇటీవల 'మనమే' సినిమాలోనూ ఆమె పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం తన చేతిలో ఉన్న 'జాతస్య మరణం ధ్రువం', 'ది బ్లాక్ గోల్డ్' వంటి చిత్రాలు ఆమెను నటిగా మరో మెట్టు ఎక్కించే అవకాశం ఉంది.

Next Story