- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Nora Fatehi: సమంతలా చెయ్యడం నీవల్ల కాదంటూ నోరా ఫతేహిని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
Nora Fatehi: సమంతలా చెయ్యడం నీవల్ల కాదంటూ నోరా ఫతేహిని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం ఇండియా మొత్తంగా ఎంతటి సెన్సేషనల్ హిట్ అందుకుందో మనకు తెలిసిందే.

X
దిశ, సినిమా: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం ఇండియా మొత్తంగా ఎంతటి సెన్సేషనల్ హిట్ అందుకుందో మనకు తెలిసిందే. ముఖ్యంగా ఆ మూవీలో ప్రతీపాట ఎంతో ఫేమస్ అయింది. అన్ని పాటల్లోకెల్లా సమంత చేసిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామ’ సాంగ్ మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా యూఎస్ డల్లాస్‌లో జరిగిన ఈవెంట్‌కు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, ఐటమ్ గర్ల్ నోరా ఫతేహి హజరయ్యారు. ఇందులో భాగంగా వీరిద్దరు ‘ఊ అంటావా మామ’ పాటకు చిందేశారు. కానీ పాటకు సంబంధం లేనివిధంగా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంతో నోరా ఫతేహిపై షాకింగ్‌గా ట్రోలింగ్ జరుగుతోంది. ‘అదేం డ్యాన్స్ మాకు నచ్చలేదు.. సమంత, అల్లు అర్జున్ డాన్స్‌కి మ్యాచ్ చేయడం మీ వల్ల కాదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Next Story






