- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతడితో డేటింగ్‌లో ఉన్న కృతి సనన్.. కన్ఫర్మ్ చేస్తూ అలాంటి పోస్ట్ పెట్టడంతో షాక్‌లో ఫ్యాన్స్!
హీరో, హీరోయిన్లు తమ తోటి నటీనటులతో డేటింగ్ చేయడం కామన్ అయిపోయింది.

దిశ, సినిమా: హీరో, హీరోయిన్లు తమ తోటి నటీనటులతో డేటింగ్ చేయడం కామన్ అయిపోయింది. కొద్దికాలం పాటు వెకేషన్స్‌ను ఎంజాయ్ చేసి ఆ తర్వాత నచ్చకపోతే బ్రేకప్ చెప్పేస్తుంటారు. తాజాగా, ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వైరల్‌గా మారాయి. ఆమె మరెవరో కాదు.. యంగ్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) గత కొద్ది కాలంగా కబీర్ బహియా (Kabir Bahiya)అనే వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు జోరందుకున్నాయి. మొదట్లో స్నేహంగా ఉన్న వీరిద్దరు ప్రేమికులుగా మారి పలు చోట్ల తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే.. కృతి సనన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టి డేటింగ్‌పై హింట్ ఇచ్చిందని చెప్పొచ్చు.
అబుదాబిలో జరిగిన UFC 321 ఈవెంట్‌కు ఈ లవ్ బర్డ్స్ హాజరయ్యారు. వీరితో పాటు వరుణ్ ధావన్ కూడా వెళ్లారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. కృతి కొన్ని షోటొలను షేర్ చేసింది. కబీర్‌తో కలిసి నవ్వుతూ సెల్ఫీకి పోజులిచ్చింది. ఇక ఈ ఈవెంట్‌లో జాకెట్ కింద బ్లాక్ టాప్, డెనిమ్ ధరించగా.. కబీర్ వైట్ టీషర్ట్, పింక్ జాకెట్, డెనిమ్స్‌ను వేసుకున్నాడు. వరుష్ విషయానికొస్తే.. మెరూన్ లెదర్ జాకెట్ కింద బ్లాక్ టీ-షర్ట్, ట్రౌజర్‌లో కనిపించాడు. ఇక ఈ ఫొటోలకు కృతి.. ‘‘అబుతాబిలో ఫైట్ నైట్ ఎనర్జీ. ఈ ఇద్దరితో కలిసి UFC-321లో ఈ ఉత్సాహాన్ని చూడటం థ్రిల్లింగ్‌గా ఉంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఈ పోస్ట్‌పై కబీర్ రెడ్ హార్ట్ ఎమోజీలు షేర్ చేయడంతో వీరిద్దరు లవ్ నిజమే అని అంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అందుకే ఇలాంటి పోస్ట్‌తో హింట్ ఇచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొందరు షాక్ అవుతున్నారు.
అయితే వీరిద్దరు ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా పలు ఈవెంట్లకు జంటగా హాజరు కావడం ఈ డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది. కబీర్ లండన్‌లో నివసించే ఒక సంపన్న కుటుంబానికి చెందినవాడు అని తెలుస్తోంది. కాగా.. కృతి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ భామ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి ‘తేరే ఇష్క్ మే’ సినిమాలో నటిస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్‌లోనూ కృతి అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.






