డబ్బులిచ్చి మరీ ఆ పని చేయించుకున్న టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్.. ఇంత గబ్బుదానివంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు?

by Disha Web Desk 9 |
డబ్బులిచ్చి మరీ ఆ పని చేయించుకున్న టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్.. ఇంత గబ్బుదానివంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు?
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది హీరోయిన్ నయనతార. అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకుంటోన్న హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, విక్టరీ వెంకటేష్, విజయ్, జూనియర్ ఎన్టీఆర్ అజిత్, సూర్య వంటి అగ్ర హీరోలతో నటించి ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. వీటితో పాటు మలయాళం, హిందీ, సినిమాల్లో అద్భుతంగా నటించి.. లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. జవాన్ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

అయితే తాజాగా నయనతార గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్ గా నిలిచింది. నయన్ కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసిందట. ఈమె నటించిన మూవీస్ హిట్ కావడం లేదని.. దీంతో తనకు ఎక్కడ ఆఫర్లు తగ్గుతాయనే భయంతో జనాలకు టికెట్లకు డబ్బులు ఇచ్చి మరీ సినిమాలు చూడమని చెప్పేదట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ప్రస్తుతం నయన్ పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఒక హీరోయిన్ కు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి. ఉండకూడనివి కూడా ఉన్నాయి. సినిమా హిట్ కావడానికి నీవు ఇలాంటి గబ్బు చేశావా?’’ అంటూ జనాలు నయనతారపై మండిపడుతున్నారు.

Next Story

Most Viewed